Kaizer News

ఒక్కసారి పర్మిషన్.. పదేండ్లు బిందాస్‌‌‌‌‌‌‌‌...! ప

ఒక్కసారి పర్మిషన్.. పదేండ్లు బిందాస్‌‌‌‌‌‌‌‌...! ప్రైవేటు స్కూళ్ల అనుమతులపై విద్యాశాఖ ఉదాసీనత..

· State - Telangana · v6velugu.com

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల అనుమతులు, రెన్యువల్ ప్రక్రియ గాడితప్పింది. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ సహా అన్ని కాలేజీలకు ఏటా అఫిలియేషన్లు తప్పనిసరి చేసిన విద్యాశాఖ.. ప్రైవేటు స్కూళ్లకు మాత్రం పదేండ్ల కాలపరిమితి పెట్టింది. దీంతో, ఒకసారి పర్మిషన్ తీసుకుంటే పదేండ్లు బిందాస్‌‌ అన్న రకంగా పరిస్థితి మారిపోయింది. పెద్ద పిల్లలు చదివే కాలేజీలకు లేని ఈ ప్రత్యేక మినహాయింపు.. చిన్న పిల్లలు చదివే ప్రైవేటు స్కూళ్ల విషయంలో కొనసాగుతుండటంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారమే 13వేలకు పైగా ప్రైవేటు స్కూళ్లు ఉండగా.. వాటిలో ఏకంగా 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో కేవలం లక్షన్నర మంది టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులోనూ చాలా వరకు బోగస్‌‌‌‌‌‌‌‌ లెక్కలేనని, మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు తమ కుటుంబ సభ్యుల పేర్లను కూడా టీచర్లుగా చూపించి మభ్యపెడ్తున్నారనే ఆరోపణలున్నాయి. పలు చోట్ల ప్రైవేటు స్కూళ్లు చిన్న అద్దె భవనాల్లో, చివరికి రేకుల షెడ్లలోనూ ఎలాంటి వసతులు లేకుండానే కొనసాగుతున్నాయి. విద్యార్థులకు సరిపడా క్లాస్ రూములు, టాయిలెట్లు, కనీసం గాలి, -వెలుతురు ఉండవు. లైబ్రరీలు, సైన్స్ ల్యాబులు ఉండవు. రూల్స్ ప్రకారం స్టూడెంట్, టీచర్ రేషియో ఉండాలి కానీ, పర్మిషన్లు తీసుకునే టైమ్‌‌‌‌‌‌‌‌లో అందరూ ఉన్నట్లు రికార్డులు చూపించి, ఆ తర్వాత అర్హులను తీసేస్తున్నారు. చాలా స్కూళ్లు ఇంటర్, డిగ్రీ చదివిన వారితోనే క్లాసులు చెప్పిస్తూ రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపే జీతాలిస్తున్నాయి. కొత్తగా స్కూల్ ఓపెన్ చేయాలంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ వరకు రూ.10 వేలు, హైస్కూల్‌‌‌‌‌‌‌‌కు రూ.20 వేలు ఫీజు కట్టాలి. ఇక రెన్యువల్ గుర్తింపు కోసం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీకి కేవలం రూ.2,500, హైస్కూల్‌‌‌‌‌‌‌‌కు రూ.5 వేలు మాత్రమే వసూలు చేస్తున్నారు. విచిత్రమేమిటంటే.. ఏకంగా 18 ఏండ్ల కింద అంటే 2008లో నిర్ణయించిన ఈ ఫీజుల రేట్లను ఇప్పటివరకు అసలు మార్చనేలేదు. కానీ, ఆయా స్కూళ్లలో స్టూడెంట్ల నుంచి వసూలు చేసే ఫీజులు మాత్రం ఏకంగా10 నుంచి 20 రెట్లు పెరిగాయి. అప్పట్లో రూ.5 వేలు వసూలు చేస్తే.. ఇప్పుడు కనీసం రూ.50 వేల దాకా తీసుకుంటున్నారు. ఏటా కనీసం పది శాతం ఫీజులు పెంచే స్కూళ్లు.. ప్రభుత్వానికి కట్టే రెన్యువల్ ఫీజులు మాత్రం పెంచొద్దంటూ వితండవాదనలు చేస్తున్నాయి. ఈ విషయంలో విద్యాశాఖ ఆఫీసర్లూ ఉదాసీనంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. కొత్త హైస్కూల్‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వమే అనుమతి ఇస్తుండగా, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు డీఈఓలు పర్మిషన్ ఇస్తారు. రెన్యువల్ మాత్రం.. అప్పర్ ప్రైమరీ వరకు డీఈఓలు, హైస్కూల్‌‌‌‌‌‌‌‌కు ఆర్జేడీ పర్మిషన్ ఇస్తారు. మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు అన్ని డాక్యుమెంట్లు సమర్పించి అనుమతులు పొందినా.. ఆ తర్వాత వసతులు, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా? లేదా? అనేది అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. నిబంధనల అమలులో అధికారుల తీరు విచిత్రంగా ఉంది. 2009 కంటే ముందు ఏర్పాటైన స్కూళ్లకు ఫైర్ ఎన్ఓసీలు అవసరం లేదని, ఆ తర్వాత ఏర్పాటు చేసిన స్కూళ్లకే ఫైర్ ఎన్ఓసీ ఉండాలనే రూల్ పెట్టారు. ఈ ఫైర

Original source: v6velugu.com
Read more on Kaizer News