Kaizer News

ఉగ్రవాయికి వైకుంఠ రథం విరాళం

· State - Telangana · sakshi.com

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి మండలం ఉగ్రవాయికి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ యూత్‌ మండల ఉపాధ్యక్షుడు పందిరి ప్రభాకర్‌రెడ్డి తన తల్లిదండ్రులు పందిరి అనుసూయ – మల్లారెడ్డిల జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళంగా అందజేశారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కొడుకు శశాంక్‌ చేతుల మీదుగా ఉగ్రవాయికి వైకుంఠ రథం అందజేయగా పలువురు దాత ప్రభాకర్‌రెడ్డిని అభినందించారు. కామారెడ్డి అర్బన్‌: గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందిన తాడ్వాయి మండలం దేమికలాన్‌కు చెందిన సీఐ ఎం.మహేశ్‌ను అతని చిన్ననాటి మిత్రులు, గ్రామస్తులు, డిగ్రీ క్లాస్‌మేట్‌లు సన్మానించారు. ఆదివారం కామారెడ్డి వశిష్ట డిగ్రీ కళాశాలలో అభినందన సభ నిర్వహించారు. సైబారాబాద్‌ కమిషనరేట్‌లో ఎస్‌బీ సీఐగా పనిచేస్తున్న మహేశ్‌ మనాలి నుంచి లడక్‌ లా ఉమ్లింగ్‌ (19,024 అడుగుల ఎ త్తు) పాస్‌ను బైక్‌ యాత్ర ద్వారా ఏడు రోజుల్లో 2100 కిలోమీటర్ల సాహసోపేతంగా పూర్తి చేసి గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించారు. తాడ్వాయి మాజీ ఎంపీపీ రాజు, ఎస్సీఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే.వెంకట్‌, ఆర్‌.భూపతి, మధుసూదన్‌రెడ్డి తదితరులున్నారు. బాన్సువాడ : ఉపాధ్యాయులపై ప్రభుత్వం మానసిక వేధింపులను ఆపాలని ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్‌ అన్నారు. ఆదివారం బాన్సువాడలో నిర్వహించిన ఎస్జీటీ ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నూతనంగా తెచ్చిన విద్యా సంస్కరణలు ప్రాథమిక పాఠశాలలో నిర్వహించే ఎస్‌ఏ–1, ఎస్‌ఏ–2 పరీక్షల బాహ్య మూల్యాంకనం నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క తరగతికి ఉపాధ్యాయులను ఇచ్చి అదనపు పనులు చేయడానికి ఐదారు పాఠశాలలకు కలిపి ఒక్క డాటా ఎంట్రీ ఆపరేటర్‌లను నియమించాలన్నారు. సమావేశంలో ఎస్జీటీ ఉపాధ్యాయులు శ్రీకాంత్‌, పండరి, ప్రవీణ్‌కుమార్‌, నిఖిల్‌, శ్రీనివాస్‌, అనీల్‌, సంతోష్‌ తదితరులున్నారు. బాన్సువాడ: బాన్సువాడ పట్టణానికి చెందిన కానిస్టేబుల్‌ రఘు నాలుగు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబానికి ఆదివారం 2012 బ్యాచ్‌కు చెంది న నిజామాబాద్‌, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లా ల్లో విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు రూ.2.96 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం కామారెడ్డి జిల్లా పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేష న్‌ అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. రఘు కుటుంబానికి పోలీసు మిత్రులు అండగా ఉంటారని, సహచర ఉద్యోగి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు వారికి చేయుతనివ్వడం ప్రతీ ఒక్క రి బాధ్యత అని అన్నారు. రఘు సతీమణికి కా రుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, కుటుంబ పరిస్థితి వివరించి తన వంతు కృషి చేస్తామన్నారు. కానిస్టేబుళ్లు రాజేశ్వర్‌రెడ్డి, శంకర్‌,ప్రవీణ్‌,సతీష్‌, బశెట్టి తదితరులు ఉన్నారు. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News