Kaizer News

టార్గెట్‌ టాప్‌–100

టార్గెట్‌ టాప్‌–100

· State - Telangana · sakshi.com

ప్రపంచస్థాయి విద్యాసంస్థల్లో ఒకటిగా ఐఐటీ హైదరాబాద్‌ను నిలపడమే లక్ష్యం ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి ప్రపంచస్థాయి పరిశోధనలు, ఆవిష్కరణల కేంద్రంగా సంస్థను తీర్చిదిద్దుతున్నాం ప్రతి ఇంజనీరింగ్‌ విభాగంలోనూ కృత్రిమ మేధను చేరుస్తున్నాం... స్టార్టప్‌ల సృష్టికర్తలుగా ఎదిగేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం వారి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేస్తున్నాం.. సాంకేతిక వసతులు అందిస్తున్నాం కల్వల మల్లికార్జున్‌రెడ్డి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌ను వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోని టాప్‌–100 విద్యాసంస్థల్లో ఒకటిగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి తెలిపారు. ఐఐటీహెచ్‌ను కేవలం ఇంజనీరింగ్‌ విద్యను అందించే సంస్థగా కాకుండా ప్రపంచస్థాయి పరిశోధనలు, ఆవిష్కరణలు, సాంకేతిక ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పరిశోధనలు, సాంకేతికత, విద్యార్థులు, విద్యాసంస్థలకు చోదక శక్తిగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు క్యాంపస్‌ కొలువుల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా ఉత్పత్తులు, స్టార్టప్‌ల సృష్టికర్తలుగా ఎదిగేలా కోర్సుల ఎంపికలో స్వేచ్ఛ, ప్రాజెక్టు ఆధారిత విద్య, వారి ఆలోచనలకు ఆర్థిక సహాయం, స్టార్టప్‌లకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. కృత్రిమ మేధను ప్రతి ఇంజనీరింగ్‌ విభాగంలోకి తీసుకెళ్లడంతోపాటు సెమీ కండక్టర్లు, 6జీ, ఫొటానిక్స్, కీలక ఖనిజాలు, వైద్య సాంకేతికత, అధునాతన తయారీ వంటి రంగాల్లో పరిశోధనలను విస్తరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ ఐఐటీ డైరెక్టర్‌గా వరుసగా రెండోసారి కూడా కొనసాగుతున్న ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి.. సాక్షి దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సంస్థ పనితీరు, భవిష్యత్‌ ప్రణాళికలతోపాటు విద్యార్థుల భవితకు సంబంధించి మనోగతాన్ని ఆవిష్కరించారు. ప్రశ్న: వచ్చే ఐదేళ్లలో ఐఐటీ హైదరాబాద్‌ను ఎలా చూడాలనుకుంటున్నారు? బీఎస్‌ మూర్తి: వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోని తొలి అగ్రశ్రేణి వంద విద్యాసంస్థల జాబితాలోకి ఐఐటీ హైదరాబాద్‌ను తీసుకెళ్లాలన్నది మా లక్ష్యం. అయితే ర్యాంకు ఒక్కటే ముఖ్యం కాదు. నాణ్యమైన పరిశోధన, మంచి అధ్యాపకులు, ప్రతిభావంతులైన పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు, అంతర్జాతీయస్థాయి మౌలికవసతులు, పరిశ్రమలతో అనుసంధానం.. ఇవన్నీ కలిసే ప్రపంచస్థాయి సంస్థను నిర్మిస్తాయి. విద్యార్థులను ఉద్యోగార్థులుగా కాకుండా సృష్టికర్తలుగా ఎలా తీర్చిదిద్దుతున్నారు? ప్రతి సెమిస్టర్‌లో విద్యార్థుల నుంచి ప్రాజెక్టు ప్రతిపాదనలు తీసుకుంటున్నాం. మంచి ఆలోచనలకు రూ. లక్ష వరకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రెండో సంవత్సరం తర్వాత అంకుర సంస్థ ప్రారంభించాలనుకునే విద్యార్థికి ప్రత్యేక ధ్రువపత్రంతో క్యాంపస్‌లోనే సాంకేతిక వసతులు ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నాం. గతేడాది మా స్టార్టప్‌లు రూ. 1,500 కోట్ల ఆదాయ స్థాయికి చేరాయి. ప్రస్తుతం 810 పేటెంట్లు ఉన్నాయి. ఒక్క ఏడాదిలోనే సుమారు 250 పేటెంట్లు వచ్చాయి. అయితే పేటెంట్‌ తీసుకోవడం దగ్గరే ఆగిపోవద్దు. అది పరిశ్రమ

Original source: sakshi.com
Read more on Kaizer News