ఎమ్మెల్యే కారును ఢీకొన్న బస్సు… టీడీపీ ఎమ్మెల్యేకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఆంధ్రప్రభ, పెనమలూరు : కృష్ణా జిల్లాలోని పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి పెడనకు వెళ్తుండగా గంగూరు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు ముందు భాగం దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేతో పాటు కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన అనంతరం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తన నివాసానికి వెళ్లిపోయారు. ఘటనకు సంబంధించిన వివరాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది