Kaizer News

జిప్పర్‌ ఇరుక్కుంటే బలంగా లాగొద్దు.. ఈ ట్రిక్‌ ట్ర

జిప్పర్‌ ఇరుక్కుంటే బలంగా లాగొద్దు.. ఈ ట్రిక్‌ ట్రై చేయండి!

· State - Telangana · sakshi.com

బ్యా గ్‌ లేదా దుస్తుల జిప్పర్‌ సరిగ్గా పనిచేయక మధ్యలోనే ఆగిపోయినప్పుడు తీవ్రమైన చికాకు కలుగుతుంది. అటువంటి సమయంలో గట్టిగా లాగితే జిప్పర్‌ పూర్తిగా ΄ాడైపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఇంట్లో సహజంగా లభించే కొబ్బరినూనెను ఉపయోగించి, ఎటువంటి ఇబ్బంది లేకుండా జాక్‌ అయిన జిప్పర్‌ను సులభంగా విడిపించవచ్చు. జిప్‌ లాక్‌ అయినపుడు బలవంతంగా లాగకుండా.. ముందుగా దారాలు లేదా క్లాత్‌ ఏమైనా ఇరుక్కుపోయాయో చెక్‌ చేయండి. జిప్పర్‌ రన్నర్‌ కింద దుస్తుల క్లాత్‌ లేదా ఏవైనా దారాలు ఉంటే వాటిని జాగ్రత్తగా పక్కకు తొలగించండి. కొద్దిగా కొబ్బరినూనెను చేతి వేలికి తీసుకుని, జిప్పర్‌ ట్రాక్‌ పొడవునా జాగ్రత్తగా పూయండి. నూనె జిప్పర్‌ పరిసరాల్లోని బట్టకు తగలకుండా చూసుకోవడం ప్రధానం. నూనె రాసిన తర్వాత, జిప్పర్‌ స్లైడర్‌ను ముందూ వెనుకకూ నెమ్మదిగా కదిలించండి. కొబ్బరినూనె జిప్పర్‌కు లూబ్రికెంట్‌గా పనిచేసి, స్లైడర్‌ సజావుగా సాగేలా చేస్తుంది. నూనె రాసినా జిప్పర్‌ కదలకపోతే టూత్‌బ్రష్‌తో శుభ్రం చేయడం లేదా ట్వీజర్‌ సాయంతో ఇరుక్కుపోయిన దారాలను తొలగించడం వల్ల సమస్య పరిష్కారమవుతుంది. ఇవి కూడా చదవండి: చెత్త ఇస్తే చదువు.. ఈ స్కూల్‌ ఐడియా అదిరిపోయింది! హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) యువతకు తోడుగా నేనుంటా..! కూటమిపై రాచమల్లు అల్లుడు ఫైర్ గురు శిష్యుల చీకటి ఒప్పందంతో రాయలసీమ తాకట్టు.. శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు తాగడానికి నీళ్లు లేవు కానీ.. డ్రగ్స్ మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి చంద్రబాబు పేరు చెప్తుంటే సల సల మండిపోతున్నారు.. మంత్రి నిమ్మలకు చేదు అనుభవం.. చుట్టుముట్టిన మార్కాపురం ప్రజలు

Original source: sakshi.com
Read more on Kaizer News