Kaizer News

నేడు నీట్‌ పీజీ పరీక్ష

· State - Telangana · sakshi.com

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో ఆదివారం నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించనున్నారు. శనివారం ఈ మేరకు పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ క్షేత్రస్థాయి అధికారులకు కాన్ఫరెన్స్‌లో ఆదేశాలిచ్చారు. కలెక్టర్‌ మాట్లాడు తూ నీట్‌ పీజీ ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 594 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఆదివా రం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులను ఉదయం 7 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. చిత్తూరులోని ఎస్వీ సె ట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, పలమనేరులోని మదర్‌ థెరిస్సా, కుప్పంలోని కుప్పం ఇంజినీరింగ్‌ కళాశా ల, ద్రవిడ వర్సిటీలో కేంద్రాలు ఏర్పాటు చేసిన ట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు నిఘాను కట్టుదిట్టంగా పెట్టాలని ఆదే శించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని స్పష్టం చేశారు. స్పై కెమెరాలు, కెమెరా గ్లాసెస్‌, ఇయర్‌ ఫోన్లు, ఇతర నిషేదిత వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుతించకూడదన్నారు. ఆన్‌లైన్‌ పరీక్ష భద్రతకు సైబర్‌ నిఘా పెట్టాలని సూచించారు. కేంద్రాల వద్ద సెక్షన్‌ 163 అమలు చేయాలన్నా రు. 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్‌, నెట్‌ సెంటర్లను మూసివేయాలని కోరా రు. కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ మోహన్‌ కుమార్‌ పాల్గొన్నారు. చిత్తూరు కార్పొరేషన్‌ : తపాలాశాఖ పరిఽధిలో పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ ఏజెంట్లుగా పనిచేయడానికి సెప్టెంబర్‌ 7వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్పీ కిరణ్‌ తెలిపారు. శని వారం ఆయన మాట్లాడుతూ చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, కుప్పంలో పనిచేసేందుకు ఆసక్తిగలవారు పాస్‌పోర్టు సైజ్‌ ఫోటో, ఆధార్‌ కార్డు, పదో తరగతి మార్క్‌లిస్టు జిరాక్స్‌ తీసుకుని చిత్తూరులోని ప్రధాన తపా లా కార్యాలయం వద్ద ఇంటర్వ్యూకు రావాలన్నారు. ఎంపికై న అభ్యర్థులు రూ.5వేల సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని వెల్లడించారు. ఇతర వివరాలకు డీఓపీఎల్‌ఐ మంజునాథ్‌ను 9849997379 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్‌ పీజీ పరీక్షకు అన్ని కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కల్పిస్తున్న ట్లు ఎస్పీ తుషార్‌ డూడీ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు 594 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. చిత్తూరులోని ఎస్వీసెట్‌ పలమనేరు మదర్‌ థెరిస్సా, కుప్పం ఇంజినీరింగ్‌ కాలేజీ, ద్రవిడ యూనివర్సిటీలలో కేంద్రాలను ఏర్పా టు చేశారని వివరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు అడ్మిట్‌, ఐడీ కార్డులతో గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి ప

Original source: sakshi.com
Read more on Kaizer News