Kaizer News

Markapur: గంజాయి పట్టివేత - ఐదుగురు అరెస్ట్, ఆటో స

Markapur: గంజాయి పట్టివేత - ఐదుగురు అరెస్ట్, ఆటో స్వాధీనం

· State - Telangana · hmtvlive.com

Shorts మార్కాపూర్: మార్కాపురం పట్టణ శివార్లలో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. సాయిబాలాజీ థియేటర్ సమీపంలోని కంపచెట్లలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కిలో గంజాయితో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కలిగి ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. అరెస్టయిన వారిలో విజయ్, జాన్‌బాషా, చాంద్‌బాషాలపై గతంలో కేసులు నమోదై ఉండటంతో పాటు సస్పెక్ట్ షీట్లు ఉన్నట్లు డీఎస్పీ డాక్టర్ యు. నాగరాజు తెలిపారు. మార్కాపురం పట్టణంలో గంజాయి విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సీఐ ఎం.డి. కె. అల్తాఫ్ హుస్సేన్, పట్టణ ఎస్సై పి. విశ్వనాథరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News