Kaizer News

ఓల్డ్ బోయిన్పల్లిలో ఈగల్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్..

ఓల్డ్ బోయిన్పల్లిలో ఈగల్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్.. 22 సార్లు నిఘా పెడితే ఇప్పుడు దొరికాడు

· State - Telangana · v6velugu.com

మైనర్లకు సిగరెట్లు అమ్ముతున్న విషయాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా మైనర్లకు సిగరెట్లు అమ్ముతున్న ఫాన్ షాపులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా 2026 ఆగస్టు 30వ తేదీన ఓల్డ్ బోయిన్ పల్లిలో ఈగల్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. మైనర్లకు సిగరెట్లు అమ్ముతున్న పాన్ షాప్ యజమానిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా ఈగల్ ఫోర్స్ అధికారులు. టోల్‌ఫ్రీ ఫిర్యాదు ఆధారంగా 22 సార్లు నిఘా పెడితే ఎట్టకేలకు నిందితుడు పట్టుబడ్డాడు. కెమెరాలతో నిఘా పెట్టిన పోలీసులు.. ఇద్దరు మైనర్లు సిగరెట్లు కొనుగోలు చేస్తుండగా వీడియో రికార్డింగ్ చేశారు. లైమ్రా పాన్ మహల్ పై బోయిన్‌పల్లి పోలీసులతో కలిసి ఈగల్ ఫోర్స్ దాడులు చేశారు. పాన్ షాప్ యజమాని, వర్కర్ ను అరెస్ట్ చేశారు.10 రకాల బ్రాండ్ల సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ సుమారు 60 వేల రూపాయలుగా గుర్తించారు. COTPA చట్టం సెక్షన్ 6, జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 77 కింద కేసు నమోదు చేశారు. నిందితులను బోయిన్‌పల్లి పోలీసులకు అప్పగించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఈగల్ ఫోర్స్ హెచ్చరించింది

Original source: v6velugu.com
Read more on Kaizer News