Kaizer News

ప్రజలకు అందుబాటులో ఉండాలి : మెట్పల్లి డీఎస్పీ రాము

ప్రజలకు అందుబాటులో ఉండాలి : మెట్పల్లి డీఎస్పీ రాములు

· State - Telangana · prabhanews.com

మేడిపల్లి, ఆంధ్రప్రభ : ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగే విధంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని మెట్‌పల్లి డీఎస్పీ ఏ. రాములు సిబ్బందికి సూచించారు. శనివారం మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన డీఎస్పీ.. సిబ్బందితో మాట్లాడారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా, గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. వారి సమస్యలను ఓపికగా విని, ఫిర్యాదులను సక్రమంగా స్వీకరించి, సాధ్యమైనంత త్వరగా పోలీస్‌ సహాయం అందించాలని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. సైబర్‌ మోసాలకు గురైన బాధితులకు సత్వర సహాయం అందించడంతో పాటు, ఫిర్యాదులను బాధ్యతగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గణేష్‌ ఉత్సవాలు, మండపాల నిర్వహణ, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతలను కాపాడాలని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి ఎస్సై శ్రీధర్‌రెడ్డితో పాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News