అక్టోబర్ 1 నుంచి రాయితీతో కూడిన ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే గృహ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం శనివారం తెలిపింది. ఇప్పటికే ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసుకున్న వినియోగదారులు ఇకపై ఎటువంటి చర్యలూ చేపట్టాల్సిన అవసరం లేదు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 19 నాటికి మొత్తం దేశీయ ఎల్‌పీజీ వినియోదారులలో 89.9 శాతం మంది, అంటే 27.43 కోట్ల మంది తమ బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణను పూర్తి చేసుకున్నారు