Kaizer News

టీమిండియా చీఫ్ సెలెక్టర్ రేసులో ఊహించని వ్యక్తి..

టీమిండియా చీఫ్ సెలెక్టర్ రేసులో ఊహించని వ్యక్తి.. ఎవరంటే?

· National - India · sakshi.com

భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI).. జూనియర్ నేషనల్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కీలక బాధ్యతలను చేపట్టే రేసులో భారత మాజీ క్రికెటర్ రమేష్ పవార్ అందరికంటే ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. కాగా 48 ఏళ్ల ప‌వార్‌కు భారత క్రికెట్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ టీమిండియా తరఫున 2 టెస్టులు, 31 వన్డే మ్యాచ్‌లు ఆడారు. ముఖ్యంగా 2004 ప్రారంభంలో పాకిస్తాన్ గడ్డపై చారిత్రాత్మక వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టులో అతడు కూడా భాగమయ్యాడు. ఇక కేవలం ఆటగాడిగానే కాకుండా కోచ్‌గానూ అతడికి మంచి అనుభవం ఉంది. భారత మహిళా క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలు అందించారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో యువ ఆటగాళ్లను తాయారు చేయడంలో కూడా అతడు కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్‌లో ముంబై, గుజరాత్ జట్లకు వివిధ హోదాల్లో కోచ్‌గా వ్యవహరించారు. ఈ సుదీర్ఘ అనుభవం జూనియర్ స్థాయి నుంచి కొత్త ప్రతిభను వెలికితీసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బోర్డు భావిస్తోంది. త్వరలోనే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మరోవైపు సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ పదవి నుంచి అజిత్‌ అగార్కర్‌ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. చదవండి : బీసీసీఐ కీలక నిర్ణయం.. 31 ఏళ్ల తర్వాత స్పెషల్‌ మ్యాచ్‌? బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News