Kaizer News

Renigunta: గంజాయి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి రేణ

Renigunta: గంజాయి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి రేణిగుంట పోలీసుల అవగాహన

· State - Telangana · hmtvlive.com

Renigunta: గంజాయి, మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని అవగాహన కల్పించే కార్యక్రమాన్ని రేణిగుంట పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు.డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో,సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు గంజాయి, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం,కుటుంబం,భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.కార్యక్రమంలో పోలీసు సిబ్బంది,స్థానికులు,యువత పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News