Kaizer News

Tirupati: తిరుమల శ్రీవారి సేవలో బీజేపీ రాష్ట్ర అధ్

Tirupati: తిరుమల శ్రీవారి సేవలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్!

· State - Telangana · hmtvlive.com

Tirupati: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పోకల వంశీ నాగేంద్ర మాధవ్ నాలుగు రోజుల తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రోటోకాల్ బ్రేక్ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకుని ప్రత్యేక సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, దేశ ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మాధవ్ ప్రార్థించారు. భారత రాజ్యాంగ పరిపాలనలో వరుసగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా మొత్తం 25 సంవత్సరాల సుపరిపాలన ప్రస్థానం కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం నుంచి దేశవ్యాప్తంగా “సేవా సంకల్ప్ మహోత్సవ్” పేరుతో ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీవారి కటాక్షంతో భారతదేశ వైభవం ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలుస్తుందని పీవీఎన్ మాధవ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, డాలర్ దివాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నాగోతు రమేష్ నాయుడు, కేతినేని సురేంద్ర నాయుడు, జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు కుర్రకాల్వ వేణు, రేణిగుంట మండల ఉపాధ్యక్షుడు రాజా రాయల్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News