Kaizer News

Nalgonda: ఎస్‌పీఆర్ స్కూల్ పరీక్ష కేంద్రాన్ని తనిఖ

Nalgonda: ఎస్‌పీఆర్ స్కూల్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ చంద్రశేఖర్!

· State - Telangana · hmtvlive.com

నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ (NEET PG) పరీక్ష ప్రశాంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక ఎస్‌పీఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ​ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాటు చేసిన తాగునీరు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను పరిశీలించి, ఇన్‌చార్జ్‌తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రంలో మొత్తం 180 మంది అభ్యర్థులకు గాను 179 మంది హాజరయ్యారని, ఒక్కరు గైర్హాజరైనట్లు అధికారులు వివరించారు. ​సమీప పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News