ధర్మవరం పట్టణంలో మత సామరస్యం వెల్లివిరిసింది. పార్థసారథి నగర్ (సిరికల్చర్ కార్యాలయం) సమీపంలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద ప్రసాదంగా ఉంచిన లడ్డూ ప్రసాదాన్ని ముస్లిం దంపతులు చాందిని, మస్తాన్ వలి వేలంపాటలో దక్కించుకున్నారు.