ముషీరాబాద్, వెలుగు: ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని గిరిజన విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గణేశ్ నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యార్థి సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. సంఘం జాతీయ అధ్యక్షుడిగా వెంకట్ బంజారా, రాష్ట్ర అధ్యక్షుడిగా బాలాజీ నాయక్, ఏపీ అధ్యక్షుడిగా గణేశ్ నాయక్ తో కమిటీని ఎన్నుకున్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించి, రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసి సేవాలాల్ మహారాజ్ యూనివర్సిటీగా పేరు పెట్టాలని కోరారు