Off The Record: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతల అంతర్గత కలహాలు పార్టీ ప్రతిష్టను బజారుకీడ్చే విధంగా తయారయ్యాయి. ఒక నియోజకవర్గంలో వర్గ పంచాయితీ సమసిపోకముందే మరో నియోజకవర్గంలో విభేదాలు పొడచూపుతున్నాయి. స్థానిక ముఖ్యనేతలకు ఇంచార్జీలకు, అలాగే ఇంచార్జీలకు జిల్లా అధ్యక్షుడికి అస్సలు గిట్టడం లేదు. నిత్యం వివాదాల్లో మునిగితేలుతున్న నేతల తీరు అధిష్టానానికీ తలనొప్పిగా మారుతోందట. గతంలో ఆదిలాబాద్ ఇంచార్జీ మంత్రిగా ఉన్న సీతక్క.. ఇక్కడి నేతలను సమన్వయం చేయలేక పక్క జిల్లాకు వెళ్లిపోయారు. ఆ స్థానంలో జూపల్లి కృష్ణారావు ఇంచార్జీ మంత్రిగా వచ్చారు. ఐనా జిల్లా కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి మారడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పీఏసీ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచీన్ సావంత్, ఇంచార్జీ మంత్రి జూపల్లి ఎదుటే నేతలు కంది శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డిల వర్గాలు బాహాబాహీకి దిగినంత పనిచేశాయి. ఆ సంఘటన మరువక ముందే మళ్లీ బోథ్ నియోజకవర్గం పార్టీ ఇంచార్జీ గజేందర్.. డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ పై తిరుగుబాటుజెండా ఎగురవేశారు. ఆయనను డీసీసీ పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేస్తూ అనుచరగణంతో కలిసి గజేందర్.. హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఫిర్యాదు చేసారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టికెటి ఆశించి భంగపడ్డ నరేష్ జాదవ్.. పార్టీ నిర్ణయాన్ని కాదని రెబల్ గా నామినేషనవ్ వేశారని, అప్పట్లో నరేష్ జాదవ్ పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుందని, అలాంటి నేతకు డీసీసీ అధ్యక్షుడిగా ఉండే అర్హతలేదని ఆరోపిస్తున్నారు ఆడే గజేందర్. బోథ్ నియోకవర్గంలో పార్టీ పదవులను డీసీసీ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మండల కమిటీల ఏర్పాటులో డీసీసీ అధ్యక్షుడు ఏకపక్షంగా వ్యవహరించారని, డీసీసీ కమిటీ నియామకాల్లో సైతం తమ అభిప్రాయాలను అడగలేదంటూ DCCపై ఆడే గజేందర్ బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. ఏకపక్షంగా నియమించిన మండల కమిటీ తమకు సహకరించడం లేదంటూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా క్షేత్రస్థాయిలో పార్టీను బలహీన పరుస్తున్నారని గజేందర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే నరేష్ జాదవ్ మాత్రం తనను గేజందర్ కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పార్టీలోని పాత, కొత్త నేతలందరినీ సమన్వయపర్చుకుంటూ ముందుకు వెళ్తున్నానని, తాను పార్టీ పదవులు అమ్మకున్నాననే ఆరోపణల్లో నిజం లేదని, నిజ నిర్దారణకోసం కావాలంటే ఎక్కడికైనా వస్తానని నరేష్ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. పార్టీలో ఉండి స్వంత ఎజెండాతో వెళ్తామంటే సహించేది లేదని నరేష్ జాదవ్ హెచ్చరిస్తున్నారు. అన్ని వివరాలు అధిష్టానానికి వినిపిస్తానని, తనను కావాలని టార్గెట్ చేయడం గజేందర్ మానుకోవాలని సూచిస్తున్నారు నరేష్ జాదవ్. జిల్లాలోని ఉట్నూరులో పీఏసీ సమావేశంలో సంజీవరెడ్డి, ఆదిలాబాద్ పార్టీ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డిల మధ్య జరిగిన ఘర్షణ పార్టీలో ప్రకంపనలు రేపాయి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం.. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా రెండురోజుల క్రితమే క్రమశిక్షణ కమిటి విచారణకు సమాధానం ఇచ్చారు. ఈ గొడవ సద్దుమనిగిందనుకుంటున్న