Kaizer News

Asian Games 2026 | పతాకధారులుగా మను భాకర్‌, తజిందర

Asian Games 2026 | పతాకధారులుగా మను భాకర్‌, తజిందర్‌పాల్‌

· Sports · prabhanews.com

ఆంధ్రప్రభ : ఒలింపిక్స్‌లో మెరిసిన స్టార్‌ షూటర్‌ మను భాకర్‌, స్టార్‌ షాట్‌పుట్‌ ప్లేయర్‌ తజిందర్‌పాల్‌ సింగ్‌ టూర్‌కు మరో గౌరవం దక్కింది. ఆసియా క్రీడలు 2026 ప్రారంభ వేడుకల్లో భారత జెండాను ముందుండి మోసే అవకాశం వీరిద్దరికీ లభించింది. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా శనివారం (సెప్టెంబ‌ర్ 19 నుంచి) జరగనున్న ఆసియా క్రీడల ఓపెనింగ్‌ సెర్మనీలో భారత బృందానికి మను భాకర్‌, తజిందర్‌పాల్‌ పతాకధారులుగా కనిపించనున్నారు. చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మను భాకర్‌ ఇప్పటికే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించింది. ఇప్పుడు ఆసియా క్రీడల్లో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రీడల్లో మను 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌, 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్లలో పోటీ పడనుంది. భారత జెండాను మోసే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమైన గౌరవమని మను తెలిపింది. మరోవైపు షాట్‌పుట్‌ స్టార్‌ తజిందర్‌పాల్‌ సింగ్‌ టూర్‌ కూడా ఆసియా క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. గత రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తజిందర్‌పాల్‌.. ఈసారి కూడా బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. 20వ ఆసియా క్రీడల్లో భారత్‌ నుంచి 500 మందికి పైగా క్రీడాకారులు 37 విభాగాల్లో పోటీ పడనున్నారు. గత ఆసియా క్రీడల్లో అంటే 2023లో చైనాలోని హాంగ్‌జౌలో భారత్‌ అదరగొట్టింది. మొత్తం 106 పతకాలు సాధించింది. ఇందులో 28 స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఈసారి కూడా భారత అథ్లెట్లు అదే జోష్‌తో బరిలోకి దిగుతున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News