Kaizer News

Vinukonda: వినుకొండలో 139 మందికి సీఎం సహాయ నిధి చె

Vinukonda: వినుకొండలో 139 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత!

· State - Telangana · hmtvlive.com

Shorts Vinukonda: ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. ఆదివారం వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధులు చెక్కులను పంపిణీ చేశారు. వినుకొండ నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో 139 మంది కుటుంబాలకు ₹ 1.08 కోట్లు సీఎం సహాయ నిది చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రెండేళ్ల కూటమి పాలనలో వినుకొండ నియోజకవర్గం లోని 2334 మంది లబ్ధిదారులకు 16.55 కోట్ల రూపాయలు సీఎం సహాయని అందించి ఆయా కుటుంబాలను ఆదుకోవడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న పేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వైద్య తదితర అత్యవసర అవసరాల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నా మని, ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం మీ సహాయ సహకారాలు అందించాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకుంటూ మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తుంటే ఓర్వలేని వైసిపి అబద్ధపు ప్రచారాలతో విషయం చెబుతుందని అలాంటి దుష్టశక్తులను ప్రజలు అడ్డుకొని తిప్పి కొట్టాలని కోరారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News