Kaizer News

వాహన డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..

వాహన డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..

· State - Telangana · prabhanews.com

సురక్షిత ప్రయాణానికి జాగ్రత్తలు తప్పనిసరి పాయకాపురం, ఆంధ్రప్రభ : వాహనాలను నడిపే డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పక పాటించాలని అజిత్‌సింగ్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ ప్రభాకర్‌ సూచించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి. రాజశేఖరబాబు ఆదేశాల మేరకు నగరంలో సేకరించిన చెత్త వ్యర్థాలను డంపింగ్‌ యార్డుకు తరలించే వాహనాల డ్రైవర్లకు శనివారం ట్రాఫిక్‌ నిబంధనలు, సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఐ ప్రభాకర్‌ వివరించారు. వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్‌ మాట్లాడటం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ముఖ్యంగా వీధుల్లో వాహనాలను రివర్స్‌ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వెనుక నుంచి వచ్చే వాహనాలు, పాదచారులను గమనించిన తర్వాతే వాహనాలను సురక్షితంగా రివర్స్‌ చేయాలని చెప్పారు. డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో అజిత్‌సింగ్‌నగర్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ కృష్ణ, ట్రాఫిక్‌ సిబ్బంది, వీఎంసీ ఎక్సెల్‌ ప్లాంట్‌ పారిశుద్ధ్య పరిశీలకుడు శివకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News