Kaizer News

Sathupalli: గణేశ్ నిమజ్జనంలో పాల్గొన్న మాజీ మున్సి

Sathupalli: గణేశ్ నిమజ్జనంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్!

· State - Telangana · hmtvlive.com

Shorts సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణంలోని 3వ వార్డు,14వ వార్డు గాంధీనగర్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూసంపూడి మహేష్ మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో సత్తుపల్లి ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులను, భక్తులను అభినందించారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల నరసింహారావు, క్లబ్బు వెంకన్న, షేక్ బాబు, మేడే శీను, దావూద్ షేక్, చాంద్ పాషా, అద్దంకి అనిల్, గండ్ర రఘు, జొన్నలగడ్డ కృష్ణ, తడికమళ్ల సాల్మన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News