Kaizer News

నదీజలాల విషయంలో రాజీప్రసక్తే లేదు

నదీజలాల విషయంలో రాజీప్రసక్తే లేదు

· State - Telangana · ntnews.com

సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు న్యాయబద్ధంగా దకాల్సిన నదీజల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో శనివారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌, ఈఎన్సీ రమేశ్‌బాబు, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌తో కలిసి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో నిర్వహించబోయే తెలంగాణ-మహారాష్ట్ర అంతర్రాష్ట్ర చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల స్థాయిలో బరాజ్‌ నిర్మాణానికి సమ్మతించాలని మహారాష్ట్రను కోరాలని, అదే తమ ప్రధాన లక్ష్యమని ఉత్తమ్‌ చెప్పారు. అప్పుడే గ్రావిటీ ద్వారా ప్రాణహిత జలాల తరలింపునకు అవకాశముంటుందని తెలిపారు. మహారాష్ట్రతో సానుకూలంగా, నిర్మాణాత్మకంగా చర్చించి ఒప్పిస్తామని అన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News