Shorts Guntur: కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మై టిడిపి యాప్ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ తెలుగుయువత వారధిగా వ్యవహరించాలని యాప్ ద్వారా ఉత్తమ ప్రతిభ కనబర్చిన రావిపాటి సాయి కృష్ణను కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. MY TDP App ద్వారా గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ చేసిన సేవలకు గుర్తిస్తూ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పంపిన పార్టీ గుర్తుతో కూడిన మొమెంటో మరియు ప్రశంశాపత్రాన్ని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు కేంద్రమంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ చేతులమీదగా రావిపాటి సాయి కృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ యువనేత నారా లోకేష్ ఆలోచనలోనుండి ఉద్బవించిన మై టిడిపి యాప్ ద్వారా వచ్చే రియల్ టైం సమాచారం సద్వినియోగం చేసుకొని కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం మరోపక్క ప్రభుత్వ సేవలకు సంబందించిన కచ్చితమైన సమాచారాన్ని సాంకేతికతను అందిపుచ్చుకొని వివిధ సామాజికమాద్యమాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ తెలుగుయువత ఒక వారధిగా క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. అంతేగాక పార్టీకి నాయకులు కార్యకర్తలు చేస్తున్న విశేష సేవలను మై టిడిపి యాప్లో రికార్డ్ చేయటం ద్వారా నేతల పని తీరు సైతం సాంకేతికత ద్వారా పార్టీ అధిష్టానానికి తెలియజేసిన వారవుతారని అందువలన లీడర్ అనాలసిస్ అధిష్టానం ఎప్పటికప్పుడు బేరీజు వేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. MyTDP యాప్ ద్వారా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పరిచయం చేస్తూ పార్టీ క్యాడర్ ని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయటమే గాక తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకుగా పనిచేస్తున్న మీలాంటి కార్యకర్తల పాత్ర కీలకం అంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అభినందనలు తెలియజేస్తూ ప్రశంసాపత్రం మరియు జ్ఞాపికను పంపటం పార్టీ కోసం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి ప్రోత్సాహం అవుతుందని సాయి కృష్ణ ఆనందం వ్యక్తం చేసారు