Kaizer News

స్లీప్ వాకింగ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రాజ్ తరుణ్ ‘టార్

స్లీప్ వాకింగ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’

· Entertainment · v6velugu.com

ఓ యంగ్ హీరో స్లీప్ వాకింగ్ చేస్తున్నట్టుగా ఇటీవల నటుడు అవసరాల శ్రీనివాస్ చెప్పగా.. ఆ హీరో ఎవరు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ సస్పెన్స్‌‌కు తెర దించుతూ మేకర్స్ ఆ హీరో ఎవరు ?, ఆయన సినిమా ఏంటి ? అనేది అనౌన్స్ చేశారు. స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘టార్టాయిస్’ అంటూ ఆదివారం ప్రకటించారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఒక డెడ్ బాడీ పక్కన హీరో రాజ్ తరుణ్ రక్తపు మరకలతో కూర్చుని ఉండటం, ఆయన పక్కనే ఒక కత్తి పడి ఉండటం ఆసక్తి రేపుతోంది. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News