Kaizer News

Jangaon: పాలకుర్తిలో భక్తాంజనేయ స్వామి ఆలయ సింహ ద్

Jangaon: పాలకుర్తిలో భక్తాంజనేయ స్వామి ఆలయ సింహ ద్వార ప్రతిష్ఠాపన!

· State - Telangana · hmtvlive.com

Jangaon: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ పనులలో భాగంగా దేవాలయ గర్భగుడి (సింహా ద్వారా ప్రతిష్ఠాపణ) దర్వాజా ఎత్తే కార్యక్రమం అధ్యాంతం కనుల పండుగగా, భక్తులు, దాతలు, ప్రజల కోలాహలం, వేద పండితుల మంత్రోచ్ఛరనాలు, మామిడి తోరణాలు, రంగు రంగుల పూలు, భజన సంకీర్తనల మధ్య ఘనంగా జరిగింది. పాలకుర్తి సర్పంచ్ కమ్మగాని విజయనాగన్న మరియు సింహా ద్వారం, కిటికీల దాత గుడికందుల.యాకన్న-సౌమ్య దంపతులు, ఆలయ పునరుద్ధరణ కమిటీ చేతుల మీదుగా ఆలయ పూజారి గంగు.నవీన్ శర్మ ఆధ్వర్యంలో అతిథులు, భక్తుల సమక్షంలో వేడుకగా కార్యక్రమాన్ని నిర్వహించారు.. అంతకు ముందు స్వామివారికి అభిషేకించి, సింధూర లేపనం చేసి, తెల్లజిల్లేడు పూలు, పూలమాలలు వేసి, నైవేద్యం అనంతరం హరతి సమర్పించారు. దైవ చింతన మనిషిని సన్మార్గంలో నడవడానికి, ప్రశాంతతకు అవసరమని, దేవాలయ పునః ప్రతిష్ట లో పాలు పంచుకొని, ఈ రోజు దర్వాజా ఎత్తే కార్యక్రమం లో పాల్గొనడం తమ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామని, ఆలయ నిర్మాణం త్వరలో పూర్తి చేసుకొని, భక్తులకు అందుబాటులో రావడానికి అందరూ సహకరించాలన్నారు పాల్గొన్న అతిథులు. దేవాలయ నిర్మాణం త్వరితగతిన దాతల సహకారంతో వేగంగా పనులు చేపడుతూ, ఆదర్శంగా నిలుస్తున్న శ్రీ భక్తాంజనేయ స్వామి భక్త మండలి సభ్యులకు అభినందనలు తెలియజేశారు.. అనంతరం పాల్గొన్న అతిథులకు ఆశీర్వచనం చేసి, ప్రసాదం అందించారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు కమ్మగాని సుధాకర్, సలేంద్ర. రమసోమన్న, దాసరి.అనూషమధు, రేపాల.అశోక్, దేవసాని.రాంబాబు, రాఘవులు (మేస్త్రి) లతో పాటు దాతలు, భక్తులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News