Kaizer News

ఏఐవైఎఫ్ ఖ‌మ్మం జిల్లా సమితి సభ్యుడిగా రెబ్బగొండ్ల

ఏఐవైఎఫ్ ఖ‌మ్మం జిల్లా సమితి సభ్యుడిగా రెబ్బగొండ్ల గోపి

· State - Telangana · ntnews.com

ఖమ్మం రూరల్, ఆగ‌స్టు 29 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన రెబ్బగుండ్ల గోపి అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) ఖ‌మ్మం జిల్లా సమితి సభ్యులుగా ఎన్నికయ్యారు. ఖమ్మం నగరంలోని గిరిప్రసాద్‌ భవన్‌లో శనివారం జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా సమితి సభ్యుడిగా నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. యువత హక్కుల సాధన కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా సమితి సభ్యుడిగా ఎన్నికైన రెబ్బగొండ్ల గోపికి పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన నాయకత్వానికి గోపి కృతజ్ఞతలు తెలిపారు

Original source: ntnews.com
Read more on Kaizer News