మొయినాబాద్: డయాబెటిస్ కారణంగా అవయవాల తొలగింపును నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ అన్నారు. మొయినాబాద్‌లోని ఫైర్‌ఫాక్స్ రిసార్ట్స్‌లో ఇండియన్ పోడియాట్రీ అసోసియేషన్, తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో శ్రీఐపాకాన్ 2026శ్రీ పేరుతో రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డయాబెటిస్ కారణంగా వచ్చే పాదాల సమస్యల నివారణ, అవయవాల పరిరక్షణే లక్ష్యంగా ఇండియన్ సోడియాట్రీ అసోసియేషన్ పనిచేస్తోందని తెలిపారు. పాదాల సమస్యలు, అవయవాల తొలగింపు వంటి తీవ్ర పరిణామాలను నివారించడానికి ముందుగా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. దేశంలో పాదాల చికిత్సను ఒక స్వతంత్ర వైద్య విభాగంగా గుర్తించాలని.. వైద్య కళాశాలల్లో ప్రత్యేక కోర్సులను ప్రవేశ పెట్టాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు ఏపీఎస్ సూరి, తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు కేవీఎన్‌ఎన్ సంతోష్‌మూర్తి, కార్యదర్శి రెజినాల్డ్ డీ లామ్, అమెరికన్ పోడియాట్రిక్ మెడికల్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు డేవిడ్ బీ ఆల్పర్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గుడుగాని శ్రీధర్, జ్ఞానేశ్వర్ అత్తూరు, పలువురు డయాబెటాలజిస్టులు, ఎండోక్రైనాలజిస్టులు, వాస్కులర్, ఆర్థోపెడిక్ సర్జన్లు, నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం