ఆదిలాబాద్‌లో అరుదైన బుడంపండ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ పండ్లు పోషకాలతో నిండి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆగస్టు-అక్టోబర్ వరకు ఆదివాసీలకు ఉపాధిని కల్పిస్తాయి. అటవీ ప్రాంతాల్లో దొరికే వీటిని రోడ్లపై విక్రయిస్తారు. ఆదిలాబాద్: అడవుల జిల్లాగా పేరోందిన ఈ ఆదిలాబాద్ జిల్లాలో అడవులే కాదు.. ప్రకృతి ఒడిలో సీజన్ వైజ్ గా వివిధ రకాల పండ్లు ఫలాలు అరుదుగా లభిస్తుంటాయి. ప్రస్తుతం ఈ సీజన్లో బుడంపండ్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ఉండే అడవి బిడ్డలు తమ వ్యవసాయ క్షేత్రాల్లో.. సమీప అడవుల్లో నుండి ఈ పండ్లను సేకరించి వారు తినడంతో పాటు మార్కెట్లో, రోడ్డుకిరువైపుల ఫుట్ పాత్ లపై కూర్చొని అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ బుడుం పండ్లు ఎక్కడ ఎక్కువగా లభిస్తాయి. వ్యవసాయ క్షేత్రాలలో బుడుంపండ్లను ఎలా సాగు చేస్తారు.? ఈ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు కలుగుతుంది..? ఈ బుడుం పండ్లను అమ్ముకుంటున్న అడవి బిడ్డలు ఏ విధంగా జీవనోపాధి పొందుతున్నారు ఈ స్టోరీలో చూద్దాం. ఆ అంటే అడవి.. ఆ అంటే ఆదివాసి.. అడవుల జిల్లాగా పేరోందిన ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన అడవులు.. అడవుల్లో అందమైన జలపాతాలు ప్రకృతిని ఆకట్టుకునే ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అడవులే కాదు.. ప్రకృతిలో మనకు కాలానుగుణంగా ఎన్నో రకాల పండ్లు, పూలు లభిస్తుంటాయి. కొన్ని సహజ సిద్ధంగా లభిస్తే, మరికొన్ని సాగు చేస్తే వస్తున్నాయి. ఏడాదిలో ఒకసారి సీజన్ వైజ్ గా మనకు కొన్ని పండ్లు ఫలాలు లభిస్తుంటాయి. వేసవిలో ఇప్ప పువ్వు, మొర్రి పండ్లు, ఇతర మరికొన్ని రకాల పండ్లు లభిస్తుంటాయి. అలా సీజనల్‌గా లభించే పండ్లలో బుడుంపండు ప్రస్తుతం అందరికీ లభిస్తున్నాయి. ముఖ్యంగా బుడుంపండు ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే లభించే అరుదైన పండు. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. ఇది తీగ జాతి మొక్కకు కాసే ఫలం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అది కూడా రెండు మూడు నెలలు మాత్రమే లభిస్తాయి. ఆకుపచ్చ రంగులో ఉన్న కాయలు పండి పసుపు పచ్చ రంగులోకి మారతాయి. మరి కొంత పండి ఆ పండు పగుళ్లు కూడా తేలుతుంది. అలా పగిలిన పండు సువాసనలను వెదజల్లుతుంది. ఆ పరిమళాలు దారి వెంట వెళ్లేవారి చూపును తనవైపు తిప్పుకునేలా చేస్తుంది బుడుంపండు. ఈ బుడుం పండును తింటే రుచి ఎంతో మధురంగా ఉంటుంది. కొందరు కేవలం బుడుం పండును మాత్రమే తింటారు. కానీ ఆదిలాబాద్ ప్రాంతంలో మాత్రం ఆ పండును ముక్కలుగా కోసుకొని అందులో పంచదారను కలుపుకొని తింటారు. ఇలా బుడుం పండుకు పంచదారను జోడించడం వల్ల ఎంతో రుచికరంగా ఉంటుంది. అటవీ ప్రాంతాల్లో అలాగే ఆదివాసీల పంటపొలాల్లో, పత్తి, కంది, జొన్న చేలలో ఈ బుడుం పండు లభిస్తుంది. దీనికి ఏ మందులు వాడకపోయినా సాధారణ వర్షాలకు సహజంగా ఈ పండ్లు కాస్తాయి. పొలంలో రోజంతా వ్యవసాయ పనులు చేసుకునే కూలీలకు ఆహారంగాను కూడా ఉపయోగపడుతుంది. ఒక పండు లేదా సగం పండు తిన్నా సరే కడుపు నిండిపోతుంది. ఇక ఆకలి అనిపించదు. తినడానికి ఎంతో మధురంగా ఉండే ఈ బుడుం పండులో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మరీ ఎక్కువగా తీపిగా ఉండదు. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తినడానికి ఇ