ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి) : వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ,213 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు శుక్రవారం నాడు టెండర్లు ఆహ్వానించింది. నవంబర్ మూడో తేదీలోగా టెండర్ బిడ్లు దాఖలు చేసేందుకు చివరి తేదీగా నిర్ణయించింది. 18 నెలల కాలపరిమితి విధించింది. ఈ నిధులతో డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్,ఏటీసి టవర్, విద్యుత్ సబ్ స్టేషన్, ఫైర్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నారు