Shorts నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల/కళాశాలను నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకులంలోని విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, భోజన నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారి విద్యాభివృద్ధికి మరింత కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు