Kaizer News

జాతీయ రహదారిపై గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా

· National - India · sakshi.com

కామారెడ్డి రూరల్‌: కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులో భారీ ప్రమాదం తప్పింది. గ్యాస్‌ లోడ్‌తో వెళ్తున్న హెచ్‌పీ వాహనం శనివారం అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. దేవునిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి గ్యాస్‌ లోడ్‌ తీసుకొని నాగ్‌పూర్‌ వైపు వెళ్తుండగా అదుపుతప్పిన వాహనం రోడ్డు పక్కన బోల్తాపడింది. ప్రమాదంలో ట్యాంకర్‌ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ట్యాంకర్‌ బోల్తాపడినప్పటికీ గ్యాస్‌ లీకేజీ కాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఫైర్‌ సిబ్బంది, పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News