Kaizer News

కింగ్‌తో.. కింగే పోటీ.. ఆ రోజు ఏం జరగబోతోంది?

కింగ్‌తో.. కింగే పోటీ.. ఆ రోజు ఏం జరగబోతోంది?

· Entertainment · sakshi.com

టైటిల్‌ ఏంటి? రిలీజ్‌ ఎప్పుడు? ఫస్ట్‌ గ్లింప్స్‌ ఎలా ఉంటుంది? అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. దీంతో నాగార్జున 67వ పుట్టినరోజు సందర్భంగా అతని 100వ సినిమాకి సంబంధించి అప్‌డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా గ్లింప్స్‌ కూడా వాళ్ల అంచనాలకు తగ్గట్టే ఉంది. అయితే సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ ‘కింగ్‌100’ చిత్రాన్ని డెసెంబర్‌ 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.. అయితే ఇక్కడే ఓ చిక్కముడి ఉంది. అదే రోజు బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ సినిమా ‘కింగ్‌’ కూడా అదే రోజు విడుదల కానుంది. దీంతో ఒకే రోజు ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయనుండటం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఆ రోజు ఎవరు విజయం సాధిస్తారోనని అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ( చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్‌లో తోపులు.. ఎవరికి ఎంతంటే ) డైలాగ్‌ ఆసక్తిని పెంచుతోంది.. ‘కింగ్‌100’ నుంచి నిన్న(శనివారం)విడుదలైన గ్లింప్స్‌లో నాగార్జున స్టైలిష్‌, పవర్‌ఫుల్‌గా కనిపించారు. ‘ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు. డబ్బున్నవాళ్లు.. డబ్బులేనివాళ్లు. నా దగ్గర డబ్బు లేనప్పుడు నన్ను లూజర్‌ అన్నారు. డబ్బు వచ్చాక కింగ్‌ అన్నారు. కానీ ఈ గుర్తింపు డబ్బు కంటే శక్తివంతమైనది. ఆ గుర్తింపును నిలబెట్టుకోవడానికి నేను పరుగెత్తుతూనే ఉండాలి’ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 28 ఏళ్ల తర్వాత నాగ్‌,టబు జోడీ ‘కింగ్100’లో టబు నటిస్తున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగర్జున, టబు ఈ జోడీ మరోసారి తెరపై కనిపించనుంది. వీరిద్దరూ తొలిసారి 1996లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో కలిసి నటించారు. ఆ తర్వాత ‘ఆవిడ మా ఆవిడే’ (1998), ‘సిసింద్రీ’ (1999) సినిమాల్లోనూ కలిసి సందడి చేశారు. డిసెంబర్‌ 24న బిగ్‌ ఫైట్‌ ఆర్‌.ఏ. కార్తీక్‌ రచన, దర్శకత్వంలో ‘కింగ్100’ తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజా మహాదేవన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సతీష్‌ కుమార్‌ ఎన్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా.. నవీన్‌ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న ‘కింగ్’ కూడా డిసెంబర్‌ 24నే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదీ చదవండి: నాగ్‌ బర్త్‌డే పోస్ట్‌కి పొరపాటున అసభ్య ఆడియో.. హీరోయిన్‌పై ట్రోలింగ్‌! షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు) ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నీకే చెప్తున్నా.. జగన్ పై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన సజ్జల నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

Original source: sakshi.com
Read more on Kaizer News