Kaizer News

వికారాబాద్‌లో మీ సేవ కేంద్రం ప్రారంభం..

వికారాబాద్‌లో మీ సేవ కేంద్రం ప్రారంభం..

· State - Telangana · prabhanews.com

వికారాబాద్, ఆంధ్రప్రభ : పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో శ్రీ వెంకటేశ్వర డిజిటల్ మీ సేవ కేంద్రాన్ని టీఆర్‌ఎస్ వికారాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు కుమ్మరపల్లి గోపాల్ ప్రారంభించారు. 8వ వార్డు గడ్డమీద పాండుతో కలిసి ఆయన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ పట్టణ అధ్యక్షుడు కే. గోపాల్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందించాలనే ఉద్దేశంతో ఈ మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు వివిధ ధ్రువపత్రాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన దరఖాస్తులను సులభంగా చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నర్సింలు, దుకాణ యజమానులు అన్న సారాం, శంకరయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News