Shorts కర్నూలు : వైద్య రంగంలో జరుగుతున్న ప్రతి పరిశోధన, ప్రతి సదస్సు, ప్రతి శాస్త్రీయ చర్చకు అంతిమ లక్ష్యం రోగికి ఖచ్చితమైన, అత్యుత్తమమైన, అధునాతన వైద్యం అందించడం తద్వారా రోగికి స్వాంతన కలిగించడమేనని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్స్‌లర్ డా. పుల్లాల చంద్రశేఖర్ అన్నారు. శనివారం కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ లెక్చర్ గ్యాలరీలో అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా (AROI) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆధ్వర్యంలో 7వ వార్షిక రాష్ట్రస్థాయి సదస్సు “AP AROICON–2026” శనివారం ప్రారంభమైంది. “ మేధావుల కలయిక, అనుభవాల పంపకం & గర్భాశయ మరియు స్రీ జననేంద్రియ క్యాన్సర్ చికిత్స యొక్క భవిష్యత్తును అన్వేషించడం".(sharing experiences & exploring the future of Gynaecological Cancer Care” )అనే అంశంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు AROI AP చాప్టర్ అధ్యక్షురాలు డా. ఎన్. సుజాత అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్‌చాన్స్‌లర్ డా. పుల్లాల చంద్రశేఖర్ మాట్లాడుతూ, 2017లో కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు తాను పునాదిరాయి వేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం అదే సంస్థ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుని క్యాన్సర్ రోగులకు సేవలందిస్తూ రాష్ట్రస్థాయి వైద్య సదస్సుకు వేదికగా నిలవడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. క్యాన్సర్ వైద్యం అత్యంత ఖరీదైనదిగా భావించినప్పటికీ, పేద ప్రజలకు కూడా అత్యాధునిక క్యాన్సర్ వైద్యం అందుబాటులో ఉండేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల ద్వారా నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. అందులో భాగంగా కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో కోట్లాది రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, ఆధునిక చికిత్సతో పాటు వైద్య పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైద్య పరిశోధనలకు రూ.30 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన ఫలితాలు చివరకు సామాన్య రోగికి ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. రాబోయే కాలంలో క్యాన్సర్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, పొగాకు వినియోగం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాద కారకాలను నియంత్రించుకోవాలని సూచించారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం ద్వారా చికిత్స ఫలితాలను మెరుగుపరచవచ్చని తెలిపారు. “డబ్బు కోసం పరుగెత్తకండి.. పేరు, జ్ఞానం, సేవ కోసం పనిచేయండి” కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన పద్మశ్రీ అవార్డు గ్రహీత, అపోలో క్యాన్సర్ సెంటర్, హైదరాబాద్ డైరెక్టర్ డా. పి. విజయ్ ఆనంద్ రెడ్డి వైద్య విద్యార్థులు, యువ వైద్యులకు ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. “డబ్బు కోసం పరుగెత్తకండి.. మంచి పేరు, జ్ఞానం, సేవ కోసం పనిచేయండి. మీరు సమాజానికి నిజాయితీగా సేవ చేస్తే డబ్బు మీ వెంట వస్తుంది” అని ఆయన అన్నారు. విజయం ఒక్కరోజులో రాదని, తక్షణ ఫలితాల కోసం ఆరాటపడకుండా ల