పిట్లం : మండల కేంద్రంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జగదీష్ ఆధ్వర్యంలో బారడి పోచమ్మ తల్లి బోనాల పండుగను ఆదివారం భక్తులు ఘనంగా నిర్వహించారు. వేంకటేఽశ్వర ఆలయం నుంచి మహిళలు బోనాలతో ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి సమర్పించారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. శివసత్తుల ప్రదర్శన ఆకట్టుకుంది. కామారెడ్డి టౌన్ : ఇస్కాన్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఇస్కాన్ మందిరంలో పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ 6 వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతామని ఇస్కాన్ ప్రతినిధి దాసు తెలిపారు. సెప్టెంబర్ 4న ఆలయ ప్రాంగణంలో భజనలు, కీర్తనలు, అభిషేకం, నిరంతర అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటా యని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం పుర వీధుల గుండా భజనలు, భక్తి పాటలతో శ్రీవారి పల్లకీ సేవ నిర్వహించారు. మద్నూర్ : మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద హనుమాన్ ఆలయం పునర్నిర్మాణం, హనుమాన్, శివలింగం, ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్ఠాపన ఆదివారం వేదపండితులు, అర్చకుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. ఆలయంలో భజనలు, కీర్తన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రేన్ సహాయంతో 40 అడుగుల పొడవు గల ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ ఉషాసంతోష్, మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే, పలు పార్టీల నాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. మద్నూర్ : మండల కేంద్రంలో ఆదివారం రాత్రి తిరుమల తిరుపతి శ్రీ బాలాజీ జెండా కొలువుదీరింది. పాత బస్టాండ్ ప్రాంతంలోని హనూమాన్ ఆలయం ముందు గ్రామస్తులు, జెండా కమిటీ సభ్యులు బాలాజీ జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిఏడాది శ్రావణమాసంలో వేంకటేశ్వరుడి జెండా మద్నూర్‌లో 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకుంటుందని, అనంతర జెండాను తిరుపతికి తీసుకెళ్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రామారెడ్డి : రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డుల్లో ’మద్దికుంట’ అని తప్పుగా ముద్రితమైంది. ‘ఊరొకటి.. కార్డులో పేరొకటి‘ అనేశీర్షికన ఆదివారం కథనం ప్రచురితమైంది. ఈవిషయమై కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరితో ఫోన్‌లో మాట్లాడారు. స్మార్ట్ రేషన్ కార్డుల తప్పిదాలను వెంటనే సరిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. భిక్కనూరు: బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటానని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తనయుడు రాష్ట్ర బీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకులు గంప శశాంక్ హామీ ఇచ్చారు. ఆదివారం మండలంలోని కాచాపూర్ లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. మాజీ ఉపసర్పంచ్ సిద్దా గౌడ్, పార్టీ నాయకులు కామినేని రాజిరెడ్డి, మల్లారెడ్డి ,మహేందర్, శ్రీనివాస్ గౌడ్ ,సిద్ధి రాములు, సత్యం భూమయ్య, భాగ్య తదితరులు ఉన్నారు. భిక్కనూరు: ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని పీసీసీ ప్రధానకార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం సిద్ధరా