Kaizer News

Anakapalli: జనసేన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు

Anakapalli: జనసేన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన రామ్కి

· State - Telangana · hmtvlive.com

Shorts అనకాపల్లి: అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక నియోజకవర్గ ప్రజలు, కూటమి కార్యకర్తల నుంచి ప్రజా సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భీమరశెట్టి రామ్కి స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యలను రామ్కి దృష్టికి తీసుకురాగా, ఆయన వాటిని సావధానంగా విని సానుకూలంగా స్పందించారు. సమస్యలను మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భీమరశెట్టి రామ్కి తెలిపారు. ప్రజలు, కూటమి కార్యకర్తలు తమ సమస్యలను పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురావచ్చని ఆయన పేర్కొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News