డబ్ల్యూఏపీఎల్ తొలి సీజన్ ప్రారంభం .. డబ్ల్యూఏపీఎల్ తెరలేపిన ఏసీఏ ట్రోఫీ ఆవిష్కరించిన నారా బ్రాహ్మణి, మిథాలీ రాజ్ డబ్ల్యూఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మంగళగిరి, ఆంధ్రప్రభ : మహిళా యువ క్రికెటర్ల ప్రతిభకు వేదికగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహిస్తున్న మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) టీ-20 తొలి సీజన్ మంగళగిరిలో ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి డబ్ల్యూఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు. స్టేడియానికి చేరుకున్న నారా బ్రాహ్మణికి ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళా క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఈ లీగ్ మంచి అవకాశాన్ని అందిస్తుందని తెలిపారు. ప్రతిభ ఉన్న క్రీడాకారిణులకు సరైన అవకాశాలు లభిస్తే వారు అద్భుతంగా రాణించగలరని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు మహిళా క్రికెటర్లు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. మంగళగిరి వేదికగా యువ మహిళా క్రికెటర్లకు అవకాశం కల్పించిన ఏసీఏ నిర్వాహకులను ఆమె అభినందించారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఫ్రాంచైజీ విధానంలో నిర్వహిస్తున్న ఈ టీ-20 లీగ్‌లో నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ లీగ్‌లో రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్, అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ జట్లు తలపడుతున్నాయి. మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఏడు రోజుల పాటు డబ్ల్యూఏపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 13 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం జరిగిన తొలి మ్యాచ్‌లో రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్ తలపడ్డాయి. సాయంత్రం జరిగిన రెండో మ్యాచ్‌లో అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ పోటీ పడ్డాయి. మహిళా క్రికెటర్లలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL), భారత మహిళా క్రికెట్ జట్టు స్థాయికి తీసుకెళ్లడమే డబ్ల్యూఏపీఎల్ ప్రధాన లక్ష్యమని ఏసీఏ ప్రతినిధులు తెలిపారు. యువ క్రీడాకారిణులకు పోటీ అనుభవం, మెరుగైన అవకాశాలు కల్పించడంలో ఈ లీగ్ కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. డబ్ల్యూఏపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్య అతిథిగా హాజరైన నారా బ్రాహ్మణిని నిర్వాహకులు ప్రత్యేక జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు, ఏపీ