Madhurawada: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్, ఐఏఎస్ శనివారం సాయంత్రం భీమిలి, మధురవాడ జోన్లలో విస్తృత పర్యటనలు, అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించారు.మొదట భీమిలి జోన్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన కమిషనర్, తర్వాత మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయానికి చేరుకున్నారు. మధురవాడ జోనల్ ఆఫీసులో నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశంలో జీవీఎంసీ పరిధిలోని అన్ని ప్రధాన శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు