Kaizer News

Nirmal: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుద

Nirmal: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి!

· State - Telangana · hmtvlive.com

Nirmal: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజుల బకాయి.. బిజెపి లడాయి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటుందని మండిపడ్డారు. విద్యార్థులకు రావాల్సిన కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల కాకపోవడంతో సతమతం ఆవుతున్నారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, లేనియెడల రానున్న రోజుల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే సీఎం ఇంటిని ముట్టడిస్తామన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News