Kaizer News

యేష నాగుల కట్టమీద ఏసిన ఉయ్యాల..

· Entertainment · ntnews.com

తెలంగాణ జానపద గీతాల్లో పాపులర్‌ అయిన ‘యేష నాగుల కట్టమీద ఏసిన ఉయ్యాల’ పాటను నాని తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌'లో రీక్రియేట్‌ చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన లైవ్‌ కాన్సర్ట్‌లో చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్‌ స్వయంగా ఈ పాటను ఆలపించి విడుదల చేశారు. కాసర్ల శ్యామ్‌ రచించిన ఈ గీతాన్ని ఒరిజినల్‌ సింగర్‌ జంగిరెడ్డి, ప్రభా ఆలపించారు. ఇప్పటికే పాపులర్‌ అయిన ఈ జానపద బాణీకి సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ తనదైన సినిమాటిక్‌ ట్రీట్‌మెంట్‌తో కొత్త ఫీల్‌ని తీసుకొచ్చారు

Original source: ntnews.com
Read more on Kaizer News