Kaizer News

‘కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే UPSC సివిల్స్‌ 3rd ర్యాంక్‌..’ IAS అనన్య రెడ్డి సక్సెస్ సీక్రెట్‌ ఇదే

· State - Telangana · tv9telugu.com

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించాలంటే రోజుకు 18, 19 గంటలు చదవాల్సిందేనా? పుస్తకాలతో గంటల తరబడి కుస్తీ పడితేనే ఐఏఎస్ కావచ్చా? అది పెద్ద అపోహ అంటున్నారు 2023 సివిల్స్‌లో ఆల్ ఇండియా మూడో ర్యాంక్ సాధించిన అనన్య రెడ్డి. సరైన వ్యూహం, నిరంతర శ్రమ, పరీక్ష డిమాండ్‌ను అర్థం చేసుకుని చదవడం ద్వారా పరిమిత సమయంలోనూ సివిల్స్‌ను సాధించవచ్చని ఆమె చెబుతున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో మూడో ర్యాంక్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అనన్య రెడ్డి తన విజయానికి హార్డ్‌వర్క్‌తో పాటు స్మార్ట్‌వర్క్ కూడా కీలకమని చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రిపరేషన్ విధానం, రోజువారీ చదువు, ప్రిలిమ్స్‌-మెయిన్స్‌ వ్యూహం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌ తదితర అంశాలను వివరించారు

Original source: tv9telugu.com
Read more on Kaizer News