Kaizer News

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామి దర్శనానిక

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి రెండు గంటలు..

· State - Telangana · v6velugu.com

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం ( ఆగస్టు 30 ) సెలవు కావడంతో ఆలయానికి పోటెత్తారు భక్తులు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. రాష్ట్రం నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సత్యనారాయణ స్వామి వ్రత మండపం, ప్రసాద విక్రయశాల, కొండ కింద పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్ లలో కూడా భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ మాసం శనివారం కావడంతో నిన్న ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో గుట్టపై కోలాహలం నెలకొంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు

Original source: v6velugu.com
Read more on Kaizer News