NTR: తిరువూరులో జోరుగా వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం! * 6వ వార్డు అశోక్‌నగర్‌లో నాలుగో రోజు ‘గడపగడపకు వైఎస్సార్‌సీపీ’ కార్యక్రమం * కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ * తిరువూరు పట్టణంలోని 28 వార్డుల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేసిన వైసీపీ శ్రేణులు * ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్న నల్లగట్ల స్వామిదాస్ * స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న వైసీపీ నాయకులు * పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి * కృష్ణా జలాల ద్వారా పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్న స్వామిదాస్ * తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి * టిడ్కో గృహాల సమస్యపై లబ్ధిదారులకు అండగా ఉంటామని స్పష్టీకరణ * వైసీపీ మున్సిపల్ చైర్మన్ అధికారం చేపట్టిన అనంతరం టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తామని హామీ * టిడ్కో గృహాల సమస్య పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష పోరాటం చేస్తామని నల్లగట్ల స్వామిదాస్ ప్రకటన * 28 వార్డుల్లో పార్టీ విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని విస్తృతం చేస్తున్న వైసీపీ శ్రేణులు * ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని నాయకుల వెల్లడి