Kaizer News

Cheepurupalli: పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ

Cheepurupalli: పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ దామోదర్!

· State - Telangana · hmtvlive.com

Cheepurupalli: విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఐపీఎస్ ఈరోజు చీపురుపల్లి పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. మహిళల భద్రత, సైబర్ భద్రత, రహదారి భద్రత, గంజాయి నియంత్రణపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలి. స్కూల్స్, కాలేజీల్లో శక్తి బృందాలు, ఎం.ఎస్.పిలు తరచూ అవగాహన కార్యక్రమాలు చేయాలి. హెల్మెట్ ధారణ, డిజిటల్ అరెస్టుల మోసాలపై ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. లాడ్జీలు, వాహనాల తనిఖీలు ఎప్పటికప్పుడు చేయాలి, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు స్పీడ్ బ్రేకర్లకు రేడియం స్టిక్కర్లు వేయాలి. పెండింగ్ కేసుల వివరాలను CCTNS లో వెంటనే అప్ లోడ్ చేయాలి. సీజ్ చేసిన వాహనాలను నిబంధనల ప్రకారం యజమానులకు అప్పగించాలి అని ఆదేశించారు. ఈ తనిఖీల్లో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ జి.శంకరరావు, ఎస్ఐ ఉమావెంకటేశ్వరరావు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News