Shorts సూర్యాపేట: సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామ పరిధిలోని NH 365 BB హైవే పై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం సుమారు 7:15 గంటల ప్రాంతంలో ఖమ్మం నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న TG 03 TR 7634 నంబర్ గల బ్లాక్ కలర్ వోల్వో కారు పిల్లలమర్రి వంతెన వద్ద అదుపుతప్పి వంతెన రైలింగ్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఢీలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మృతుడిని కసుకుర్తి జగదీష్ (50), తండ్రి బాలాజీ, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా గా గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా న్యూరో సర్జన్ వైద్యుడు. గత 20 సంవత్సరాలుగా ఖమ్మంలోని మమత హాస్పిటల్ లో పనిచేస్తున్నారు. ఈ రోజు ఉదయం 6:30 గంటలకు ఖమ్మం నుండి బయలుదేరి హైదరాబాద్ లో నివాసం ఉంటున్న తన భార్య, ఇద్దరు కూతుర్లను కలుసుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతుడి అన్న కసుకుర్తి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట రూరల్ ఎస్ఐ ఎం. అనిల్ రెడ్డి తెలిపారు