పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం: మేడారం సర్పంచ్ భారతి వెంకన్న తాడ్వాయి, ఆంధ్రప్రభ : విద్యార్థులు స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని మేడారం సర్పంచ్ పీర్ల భారతి వెంకన్న సూచించారు. తాడ్వాయి మండలం మేడారం ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పీర్ల భారతి వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భారతి వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతంగా జీవించగలమని పేర్కొన్నారు. స్వచ్ఛతా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు విద్యార్థులు చురుకుగా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలకుంట కృష్ణ, ఉపాధ్యాయులు సుతారి రమేష్, కొక్కెర రమేష్, పంచాయతీ కార్యదర్శి శరత్, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు