Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి(మం) శేషాచలం అటవీ ప్రాంతంలో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు. భాకరాపేట, దిగువూరు నుంచి చంద్రగిరి వైపు వస్తున్న 13 ఏనుగుల మంద, అటవీ ప్రాంతం నుంచి తిరుమల వైపు పయనిస్తున్న మరో 22 ఏనుగులు. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్న అటవీ శాఖ అధికారులు. భీమవరం, చిన్న రామాపురం, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అటవీ ప్రాంతం వైపు వెళ్లవద్దని అధికారుల సూచన