తనను బీఆర్ఎస్ వదిలిన బాణమని కొంతమంది, కాంగ్రెస్ బాణం అంటూ మరికొంతమంది చేస్తున్న విమర్శలపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వాళ్లూ వీళ్లూ వదిలిన బాణాన్ని కాదని, దశాబ్దాలుగా అధికారానికి, విద్యకు దూరంగా ఉన్న బహుజనుల బాణాన్ని అని స్పష్టం చేశారు. బహుజనుల హక్కుల కోసం ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ తో అయినా కొట్లాడేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఆదివారం నిర్వహించిన 'పాంచజన్య సంకల్ప సభ' లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోదీలతో పోరాటం చేసి చూపిస్తానని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి మద్దతు లేకుండా ఒక మహిళ రాజకీయంగా ఎదగగలదని నిరూపిస్తానని తెలిపారు. ఇన్నాళ్లు అయ్యల పాలనలో ఒరిగిందేమీ లేదని ఇక తెలంగాణలో మాతృస్వామ్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బీఆర్ ఎస్ కు, కాంగ్రెస్ అవకాశం ఇస్తే చేసేందేమీ లేదన్నారు. తనకు అవకాశం ఇస్తే ఒక తల్లిలాగా ఆలోచించి పాలన సాగిస్తానని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నేను బహుజనుల బాణాన్ని... కేసీఆర్, రేవంత్, మోదీ ఎవరితోనైనా కొట్లాడుతా: కవిత! #KalvakuntlaKavitha #TRS #PoliticsToday #Telangana #OITelugu pic.twitter.com/IdD8tCvleA ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు కూడా డబ్బులు అడుగుతున్నారని కవిత తెలిపారు. ఇప్పటికీ నీళ్లు రాని ఎన్నో గ్రామాలు ఉన్నాయని, రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందన్నారు. ఆయన తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ మళ్లీ వెనక్కి వెళ్లిందన్నారు. గట్టు, కేటిదొడ్డు మండలాల్లో అఫ్గానిస్తాన్ తో సమానంగా అక్షరాస్యత ఉందని.. అందుకు సీఎం సిగ్గుపడాలన్నారు. విద్యా శాఖ మంత్రిగాను ఉన్న ముఖ్యమంత్రి రెండేళ్లలో పరిస్థితి మార్చాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ కు 13 సీట్లు ఇస్తే ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, ఇందిరమ్మ ఇండ్లలో డబ్బుల దందా చేస్తున్నారని కవిత విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోని ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలని కోరారు. 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే పేరు మార్చుకుంటా రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా, కరెంట్, నీళ్లు, రైతు భరోసా, మద్దతు ధర ఇలా ప్రతి దానికి రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారుల కాళ్లపై పడి రైతులు వేడుకుంటున్న సంఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయని తెలిపారు. రైతులకు కనీసం సాగు నీళ్లు ఇవ్వటం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావటం లేదని విమర్శలు గుప్పించారు. జురాల వద్ద రెగ్యులేటర్ ను పగలకొట్టి రైతులు నీళ్లు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జురాల నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉన్న సరే చేయటం లేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక జురాల నుంచి నీటిని ఎత్తిపోసి కొడంగల్, మక్తల్, నారాయణ్ నుంచి ఇబ్రహీం పట్నం వరకు 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని భరోసా ఇచ్చారు. లేదంటే పే