Kaizer News

Markapur: మార్కాపురంలో పోలీసు పహారాలో సీపీఎం కార్య

Markapur: మార్కాపురంలో పోలీసు పహారాలో సీపీఎం కార్యాలయం!

· State - Telangana · hmtvlive.com

Markapur: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం రానున్న నేపథ్యంలో సీపీఎం కార్యాలయం వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. వెలిగొండ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడంలో కమ్యూనిస్టు పార్టీల పోరాటాలు కీలక పాత్ర పోషించాయని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా పాలక పార్టీలు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశాయని, ప్రాజెక్టు సాధనతో పాటు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కేసులు, జైలు శిక్షలను సైతం లెక్కచేయకుండా అనేక ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో సీపీఎం నాయకులపై ఉదయం 5 గంటల నుంచే పోలీసుల నిర్బంధ చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. సీపీఎం కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించడంతో కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్బంధ చర్యలను ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి

Original source: hmtvlive.com
Read more on Kaizer News