AI in Cinema: సినీ ప్రపంచంలో ప్రతి నటుడి ప్రయాణం వెనుక ఒక పెద్ద కథే ఉంటుంది. అందరూ మొదటి సినిమాతోనే స్టార్స్ అయిపోరు. కొందరు తమ ప్రయాణాన్ని గుంపులో ఒకరిగా మొదలుపెడతారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత డిస్కో కింగ్‌గా మారారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ 'శూల్' సినిమాలో ఒక చిన్న వెయిటర్ పాత్ర చేసి, ఆపై ఏళ్ల తరబడి గుర్తింపు లేని పాత్రలు పోషిస్తూ వచ్చి ఈరోజు గొప్ప నటుడిగా నిలిచారు. తెలుగు సినిమాల విషయానికొస్తే, ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'లో మహిష్మతి రాజ్యంలో ఒక సాధారణ పౌరురాలిగా, జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించిన కల్పలత ఆ తర్వాత 'సలార్', 'పుష్ప' వంటి భారీ చిత్రాల్లో మంచి ప్రాధాన్యమున్న పాత్రలు దక్కించుకున్నారు